పవన్ కల్యాణ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కామెంట్స్

తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు

Update: 2026-02-06 06:05 GMT

 ponnam prabhakar

తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ తో ఎలా పెట్టుకుంటారని బీజేపీ నేతలను ప్రశ్నించారు. తెలంగాణ వ్యతిరేకిగానే పవన్ కల్యాణ్ ను పరిగణిస్తామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. పవన్ ఎప్పటికీ తెలంగాణ వ్యతిరేకి అని అన్నారు. తెలంగాణ వ్యతిరేక పార్టీలతో పొత్తు పెట్టుకుంటే ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెబుతారని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఎక్కడికి వెళ్లైనా ప్రచారం చేసుకోవచ్చన్నారు.

పొత్తు పెట్టుకుని...
అయితే తెలంగాణ ఏర్పాటు ను వేర్పాటు వాదంగా చూపెట్టిన పవన్ కల్యాణ్ ఇక్కడి ప్రజలను అవమానపర్చడమేనని అన్నారు. కోనసీమ కొబ్బరి చెట్లు తెలంగాణ వాళ్ల దిష్టి తగిలి ఎండిపోయాయని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు మీకు గుర్తుకు రాలేదా? అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. అటువంటి వారితో పొత్తు పెట్టుకుని తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని నిలదీశారు. కొండగట్టు కు పవన్ కల్యాణ్ రావచ్చు.. పోవచ్చని ఆయన తెలంగాణకు అనుకూలమైన వ్యక్తి కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.


Tags:    

Similar News