KTR : నేడు నిజామాబాద్ జిల్లాలో కేటీఆర్ ప్రచారం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు

Update: 2026-02-07 05:35 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆయన నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు బాన్సువాడ, భిచ్ముంద, ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సమయం దగ్గర పడుతుండటంతో వరస సభలతో కేటీఆర్ హోరెత్తిస్తున్నారు.

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో...
గత రెండేళ్ల నుంచి కాంగ్రెస్ పాలనపై ఆయన నిప్పులు చెరుగుతున్నారు. రెండేళ్లలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను ఇవ్వకుండా ప్రజలను మళ్లీ ఓట్లు అడగటానికి నైతిక హక్కు లేదంటూ ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. మరొకవైపు మాజీ మంత్రి హరీశ్ రావు కూడా బీఆర్ఎస్ అభ్యర్థుల తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.


Tags:    

Similar News