Telangana : నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ పై విచారణ
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసు విచారణను జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ చేయనుంది. ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాదరావు అనర్హత పిటీషన్ పై విచారించి తీర్పు చెప్పారు. క్లీన్ చిట్ ఇచ్చారు. వారు పార్టీ మారారనడానికి ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు.
ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు...
అయితే పది మంది ఎమ్మెల్యేలలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటీషన్ లపై విచారణ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికే చాలా సమయం ఇచ్చామన్న సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసిన నేపథ్యంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయాల పూర్తి సమాచారాన్ని తెలపాలని స్పష్టం చేసింది. దీనిపై ధర్మాసనం ఎలాంటి ఆదేశాలు ఇవ్వనుందన్నది తేలనుంది.