Tiger : సిద్ధిపేట జిల్లాకు వచ్చేసిన పెద్దపులి

తెలంగాణలో పులి సంచారం కలకలం రేపుతుంది

Update: 2026-02-07 06:03 GMT

తెలంగాణలో పులి సంచారం కలకలం రేపుతుంది. నిన్నటి వరకూ జనగామలో ఉన్న పెద్దపులి నేడు సిద్ధిపేట జిల్లాలోకి ప్రవేశించింది. గత కొన్నాళ్లుగా ఈ పెద్దపులి యాదాద్రి, జనగామ జిల్లాల్లో సంచరిస్తుంది. అక్కడి నుంచి నేరుగా సిద్ధిపేట జిల్లాలోకి వచ్చిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. సిద్ధిపేట జిల్లాలోని న్మేటమండలం అమ్మాపూర్ లో పెద్దపులి కనిపించింది.

జనగామ నుంచి...
ఇక్కడ రెండు దూడలను చంపినట్లు అక్కడ రైతులు అటవీ శాఖ అధికారులకు తెలిపారు. దీంతో వెంటనే అటవీ శాఖ అధికారులు అక్కడికి వచ్చి పులి పాదముద్రలను గుర్తించారు. పాదముద్రల ఆధారంగా యాదాద్రి జిల్లా నుంచి సిద్ధిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అమ్మాపూర్ ప్రాంత ప్రజలు సాయంత్రం వేళ బయటకు రావద్దని కోరారు.


Tags:    

Similar News