Telangana : ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

Update: 2025-12-29 06:11 GMT

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను జనగాం జిల్లా జఫర్‌గఢ్‌కు చెందిన చిల్లర బాలకృష్ణ, రాయల అనిల్‌గా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారు జనగాం జిల్లా స్టేషన్‌ ఘనపూర్‌ మండలం ఉప్పుగల్లు గ్రామానికి చెందిన కే. అజయ్, కొల్లిపాక క్రాంతి, గట్టు రాకేశ్ లు అని పోలీసులు తెలిపారు.

లారీ ఢీకొట్టడంతో...
ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం సుమారు 5.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కల్లూరు వైపు నుంచి తల్లాడకు వస్తున్న కారును ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. లారీ తల్లాడ నుంచి కళ్లూరు వైపు వెళ్తోంది. జగన్నాథ్‌ యాత్రకు వెళ్లి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే తల్లాడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను ఖమ్మం ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి మృతదేహాల గదికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.


Tags:    

Similar News