మణిపూర్ తగలబడుతుంటే మోదీ, షా ఓట్ల వేట : రేవంత్

అవిశ్వాస తీర్మానం చర్చలో టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయ‌న మాట్లాడుతూ..

Update: 2023-08-09 14:30 GMT

అవిశ్వాస తీర్మానం చర్చలో టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయ‌న మాట్లాడుతూ.. ఆదివాసులు, గిరిజనుల పట్ల ప్రధానికి చులకన భావన ఉందన్నారు. ప్రధాని, మంత్రి మండలి పైన ప్రజలకు విశ్వాసం పోయిందన్నారు. జాతుల మధ్య విభజనను, బ్రిటీషర్ల విధానాన్ని బ్రిటీష్ బీజేపీ తీసుకు వస్తుందని ఆరోపించారు. మణిపూర్ లో కుకీలు, మైతీల మధ్య విభజనను తీసుకు వచ్చారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మణిపూర్‌లో ఆడబిడ్డలు కాలిపోయి, అక్కడి ప్రజల తలలు తెగిపడుతుంటే బాధ్యత వహించాల్సిన ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలు కర్నాటకలో ఓట్ల వేటలో ఉన్నారని ఆరోపించారు. మణిపూర్‌లో గిరిజనులపై జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకుని రాముడిని, భజరంగ్ దళ్‌ను రాజకీయాలకు వాడుకుందామని చేసిన ప్రయత్నాలను కర్నాటక ప్రజలు తిప్పికొట్టారన్నారు.

ప్రధాని సభకు రాకుండా తప్పించుకుంటున్నార‌ని అన్నారు. ప్రధానికి ఎన్నికల ప్రయోజనాలే తప్పా , ఆదివాసుల సమస్యలు పట్టడం లేదని అన్నారు. ప్రధాని సభకు వచ్చి చర్చలో పాల్గొనేలా స్పీకర్ ఆదేశించాలన్నారు. ఆదివాసీ దినోత్సవం రోజున సభకు రాకుండా ఆదివాసీలను ప్రధాని అవమానప‌రిచార‌న్నారు. వన్ నేషన్.. వన్ పర్సన్ అనే విధానాన్ని ప్రధాని తీసుకువచ్చారని.. బీజేపీలో సీనియర్ నేతలను మోదీ పక్కన పెట్టారని.. వన్ నేషన్.. వన్ పర్సన్ అనేలా ప్రధాని మార్చార‌ని అన్నారు. పది సంవత్సరాలలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని.. లిక్కర్ పార్టీ, నిక్కర్ పార్టీ కలసి తెలంగాణ ను దోచుకుంటున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు.


Tags:    

Similar News