కాంగ్రెస్ నేతలను వేధించడానికి కారణం ఎవరంటే?

తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ

Update: 2023-11-24 09:01 GMT

తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ - బీఆర్ఎస్ కుమ్మక్కయ్యారని అన్నారు. అందుకే కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు జరుగుతూ ఉన్నాయన్నారు. అత్యున్నత ప్రభుత్వ సంస్థలు, రాజ్యాంగ బద్ధ వ్యవస్థలను సైతం ప్రధాని మోదీ, కేసీఆర్ రాజకీయ క్రీడలో పావులుగా మార్చేశారన్నారు.

ఆ రెండు పార్టీలలో చేరిన వాళ్లు పవిత్రులని అంటున్నారని.. ప్రతిపక్షంలో ప్రజల తరఫున కొట్లాడే వాళ్లు ద్రోహులుగా ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదు... ప్రశ్నించే గొంతులే మిగలకూడదన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఇది బీజేపీ - బీఆర్ఎస్ మధ్య కుదిరిన కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ అని తేల్చారు.
కేవలం కాంగ్రెస్ నాయకులే టార్గెట్ గా ఈడీ, ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి...వీటి వెనుక ఉన్న అదృశ్య హస్తాలు ఎవరివి?! కాంగ్రెస్ నేతలను వేధించాలన్న ఆదేశాలు ఈడీ, ఐటీ సంస్థలకు ఎక్కడ నుండి అందుతున్నాయని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. గడచిన పదేళ్లలో మోదీ - అమిత్ షా ఆదేశాలు లేకుండా ఈడీ, ఐటీ సంస్థల్లో చీమచిటుక్కుమన్నది లేదన్నారు. కాంగ్రెస్ నేతల ఇళ్లపై జరుగుతోన్న దాడుల వెనుక ఎవరున్నారో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ గెలుపు అవకాశాలు పెరుగుతున్న కొద్దీ... ఈడీ, ఐటీ దాడులూ పెరుగుతున్నాయని ఆరోపించారు. అమిత్ షా - కేసీఆర్ కలిసి ప్రణాళిక రచించడం... పీయూష్ గోయల్, కేటీఆర్ కలిసి దానిని అమలు చేయడం.. ఇదే కదా జరుగుతున్నదన్నారు. ప్రతి రోజు సూర్యుడు అస్తమించగానే... వీళ్ల కుట్రలకు పథక రచన జరుగుతోందని.. కేసీఆర్ కు వందల కోట్ల విరాళాలు ఇచ్చిన వ్యక్తుల జోలికి ఆ సంస్థలు వెళ్లవన్నారు. తెలంగాణలో దొరల రాజ్యం పోయి ప్రజల రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలన్నారు. పదేండ్లలో కేసీఆర్ లక్షకోట్లు దోచుకున్నారని, నగరం చుట్టు 10 వేల ఎకరాలు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. కేసీఆర్​ సిద్దిపేట, కరీంనగర్, పాలమూరులో గెలిచినా అక్కడ ప్రజలను పట్టించుకోలేదని, ఆ తర్వాత గజ్వేల్ కు వచ్చిండని, పదేండ్లలో ఆయన బండారం బయటపడగానే కామారెడ్డికి పారిపోయారని విమర్శించారు.


Tags:    

Similar News