Breaking : తెలంగాణ కొత్త చీఫ్ సెక్రటరీగా రామకృష్ణారావు
తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ లను బదిలీ చేస్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త చీఫ్ సెక్రటరీగా రామకృష్ణారావును నియమించింది
తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ లను బదిలీ చేస్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త చీఫ్ సెక్రటరీగా రామకృష్ణారావును నియమించింది. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుండటంతో ఆమె స్థానంలో రామకృష్ణారావును ఎంపిక చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారిగా రామకృష్ణారావు వివిధ శాఖలలో వివిధ హోదాల్లో పనిచేశారు.
ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న
ప్రస్తుతం ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావును ప్రభుత్వం నియమించింది. ఇదే సమయంలో ఐఏఎస్, ఐపీఎస్ లను కూడా బదిలీ కూడా జరిగింది. పరిపాలన పరమైన విషయాలలో పనితీరును పరిశీలించి ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయిన అధికారులను బదిలీ చేశారు.