CPI : పేదల పక్షాన.. బడుగులకు అండగా సీపీఐకి వందేళ్లు

సీపీఐ అవతరించి శత వసంతాలు జరుగుతున్న సభలో నేడు ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు

Update: 2026-01-18 05:49 GMT

సీపీఐ పుట్టి వందేళ్లవుతుంది. కమ్యునిస్టు పార్టీ అవతరించి శత వసంతాలు జరుగుతున్న సభలో నేడు ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. అంతకు ముందు దేశానికి స్వాతంత్ర్యం కోసం, తర్వాత పేదల సంక్షేమం కోసం ఎర్ర జెండాలు పట్టుకుని పనిచేశాయి. పేదల సమస్యలు ఎక్కడుంటే అక్కడ కమ్యునిస్టులు ప్రత్యక్ష మవుతారు. అలాంటి కమ్యునిస్టులు ఒకనాడు దేశంలో కీలక భూమిక పోషించారు. అయితే క్రమంగా కమ్యునిస్టు పార్టీలు తమ ఉనికిని కూడా కోల్పోతున్నాయి. అయినా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ ముఖ్య పాత్రను పోషిస్తున్నాయి. కేరళ, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ ఎర్ర జెండా కోసం అనేక మంది నిరుపేదలు ఆశతో ఎదురు చూస్తుంటారు.

ఎర్రని తోరణంలా...
ఖమ్మం వేదికగా నేడు సీపీఐ శత వసంతాల వేడుక జరగనుంది.ఇందు కోసం ఖమ్మం. ఎర్రని తోరణంలా మారింది. శతవసంతాల సీపీఐ వేదుకలకు వేదికైంది. ఆదివారం నగరంలో జరిగే ఎర్ర సైనికుల కవాతు... ఖమ్మం ఎస్పార్ అంద్బజీఎన్నార్ కళాశాల మైదానంలో జరిగే సభ కోసం ముస్తాబైంది. ఎర్రెర్రని జెండాలు, తోరణాలు, స్వాగతద్వారాలతో అరుణవర్ణాన్ని పులుముకుంది. గత వైభవాన్ని చాటుతూ.. భవిష్యత్ వైభవానికి వంది పలుకుతూ... జరుగుతున్న ఈ సంరంభానికి సర్వం సిద్ధమైంది. ఈ ముగింపు ఉత్సవాలకు జాతీయ వాయకులతోపాటు విదేశీ ప్రతినిధులు కూడా హాజరవుతున్నారు. ఇక ఇండియా కూటమి మిత్రపక్షంగా ఉన్న క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక అతిథిగా రానుండటం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
ఉత్సవాల కోసం...
సీపీఐ శతాబ్ది ఉత్సవ ముగింపు సభ కోసం నగరంలోని ఎస్సార్అండ్ బీజీఎన్నార్ కళాశాల మైదానంలో భారీ ఏర్పాట్లు చేశారు. దేశ, విదేశీ ప్రతినిధులు కూడా హాజరవుతున్న నేపథ్యంలో ఈ బహిరంగ సభకు ఐదు ప్రత్యేక రైళ్లు, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రైవేటు వాహనాలతో భారీ జనసమీకరణ కు ఏర్పాట్లు చేశారు. 1925 డిసెంబర్ 26న భారత కమ్యునిస్టు పార్టీ (సీపీఐ) ఆవిర్భవించిన కాన్పూర్ నుంచే గతే డాది ఇక్కడి శతాబ్ది ఉత్సవ వేడుకలను ప్రారం బించింది. ఏడాది పాటు దేశ వ్యాప్తంగా ఘనంగా కార్యక్రమాలను నిర్వహించిన సీపీఐ. ఖమ్మం వేదికగా ముగింపు ఉత్సవాలను నిర్వహి స్తోంది. స్వాతంత్ర్యపోరాటం, తెలంగాణ సాయు ధపోరాటం నడిపిన ఖమ్మంగడ్డకు కమ్యునిస్టు పార్టీకి ఎంతో అనుబంధం ఉంది.శతాబ్ది ఉత్సావాల ముగింపు సభ సంద ర్భంగా ఖమ్మంలో ఆదివారం తెలుగురాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులతో భారీ ప్రదర్శనను నిర్వహిస్తు న్నారు.


Tags:    

Similar News