Fine Rice : గుడ్ న్యూస్.. సన్నబియ్యం ధరలు తగ్గాయి.. రీజన్ ఇదేనా?

తెలంగాణలో సన్నబియ్యం ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.

Update: 2025-07-14 04:19 GMT

తెలంగాణలో సన్నబియ్యం ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇన్నాళ్లు సన్న బియ్యం కొనుగోలు చేయాలంటే పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు భారంగా ఉండేది. అయితే గత కొన్నాళ్లుగా తెలంగాణలో సన్న బియ్యం దిగుబడి పెరగడంతో పాటు క్వింటాల్ కు ఐదు వందల రూపాయలు బోనస్ ను ప్రభుత్వం చెల్లిస్తుండటంతో సాగు విస్తీర్ణం పెరిగింది. ఇక రేషన్ దుకాణాల్లోనూ సన్న బియ్యం గత ఉగాది నాటి నుంచి పంపిణీ చేస్తున్నారు. పేద కుటుంబాలు కూడా సన్నిబియ్యాన్ని వినియోగిస్తున్నారు. దీంతో సన్న బియ్యం తెలంగాణలో తగిన రీతిలో దొరకడంతో పాటు ధరలు కూడా తగ్గడంతో చాలా వరకూ పేద, మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట లభించినట్లయింద.ి

గతంతో పోల్చుకుంటే...
గతంలో సన్నిబియ్యం క్వింటాల్ ధర ఐదు వేల రూపాయల నుంచి ఆరువేల మధ్య ఉంది. ప్రస్తుతం వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయల వరకూ తగ్గింది. ప్రస్తుతం సన్నబియ్యం క్వింటాల్ ధర తెలంగాణలో నాలుగు వేల నుంచి నాలుగువేల ఐదు వందల రూపాయలకు చేరింది. బ్రాండెడ్ కంపెనీలకు చెందిన సన్న బియ్యాన్ని కూడా కంపెనీలు ధరలు తగ్గించి విక్రయించాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాల్‌కు ఐదువందల రూపాయల బోనస్ ప్రకటించింది. అంతేగాక, రేషన్ కార్డు కలిగిన ప్రజలకు సరఫరాను పెంచడంతో బహిరంగ మార్కెట్‌లో డిమాండ్ తగ్గింది. ఫలితంగా ధరలు మార్కెట్ లో పడిపోయాయి. జూన్ నుంచి ప్రారంభమైన ఈ ధరల తగ్గుదల, జూలై మొదటివారంలో మరింత ప్రభావం చూపింది.
డిమాండ్ తగ్గడంతో...
సాధారణంగా గతంలో సన్నబియ్యం ధరలు మార్కెట్ లో కొనుగోలు చేయాలంటే కొందరి వల్లనే అయ్యేది. అయితే సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు బయట మార్కెట్ లో వీటి కొనుగోళ్లు భారీగా తగ్గిపోవడంతో ధరలు కిందకు దిగివచ్చాయని వ్యాపారులు చెబుతున్నారు. హెచ్ఎంటీ రకం బియ్యం రూ.5,600 నుంచి రూ.4,600, కర్నూల్ మసూరి: రూ.4,800 → రూ.4,000 లుగా, జై శ్రీరామ్ రకం బియ్యం రూ.5,800 నుంచి రూ.4,600 లకు, ఆర్ఎన్‌ఆర్, సాంబా రకం బియ్యం క్వింటాలుకు రూ.1,000 వరకూ తగ్గాయి. దిగుబడి కూడా పెరగడం కూడా సన్నబియ్యం ధరలు తగ్గడానికి కారణాలుగా చెబుతున్నారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల రేషన్ లేని కుటుంబాలు నెలకు సుమారు 60 వేల టన్నుల బియ్యం బహిరంగ మార్కెట్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నాయి.


Tags:    

Similar News