ఆయన్ను ఓడించడానికి.. 300 కోట్లు

పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు

Update: 2023-11-25 10:28 GMT

పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలేరులో తనను ఎలాగైనా ఓడించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర పన్నారని పొంగులేటి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజల బతుకులు విచ్ఛిన్నమయ్యాయని.. పదేళ్ల కాలంలో దోచుకున్న లక్షల కోట్లతో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు యత్నిస్తున్నారని అన్నారు. తనను ఓడించేందుకు స్థానిక ఎమ్మెల్యేకు రూ. 300 కోట్లు పంపించారని చెప్పారు.

ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణను దొరల, దోపిడీ పాలన నుంచి కాపాడుకోవాలని అన్నారు. సుస్థిర పాలనను అందించే కాంగ్రెస్ ను గెలిపించుకోవాల్సి ఉందని.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పాలనను అంతమొందించేందుకు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. కేసీఆర్ పంచే డబ్బు మనదేనని... ఆ డబ్బు తీసుకుని కాంగ్రెస్ కే ఓటు వేయాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
ఇక నేలకొండపల్లిలో ఎన్నికల ప్రచారంలో పొంగులేటి మాట్లాడుతూ.. రాబోయే కురుక్షేత్రంలో ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న యుద్ధంలో మీరందరూ ఇందిరమ్మ రాజ్యం కోసం హస్తం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కేసీఆర్ తెలంగాణకు చేసింది ఏమీ లేదు.. ఆయన స్వప్రయోజనాల కోసమే తప్ప తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదన్నారు. BRS ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఒకటి కుంగి పోయింది, మరోకటి నెర్రెలు ఇచ్చింది. బీజేపీ, BRS కలిసి ఈనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా చేయాలని చూస్తున్నారన్నారు.


Tags:    

Similar News