బండి సంజయ్ పై నాన్ బెయిల్ బుల్ కేసులు

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.

Update: 2022-01-03 04:28 GMT

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. పోలీసుల విధులను అడ్డుకోవడం, కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించడం కింద ఈ కేసులు నమోదయ్యాయి. మరికాసేపట్లో బండి సంజయ్ ను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించనున్నారు. అక్కడి నుంచి నేరుగా న్యాయస్థానంలో ప్రవేశ పెట్టనున్నారు.

మరికాసేపట్లో...
జీవో నెంబరు 317కు వ్యతిరేకంగా బండి సంజయ్ జాగరణకు దిగిన సంగతి తెలిసిందే. దీనిని పోలీసులు భగ్నం చేసి బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అడ్డుకున్న కార్యకర్తలపై లాఠీ చార్జి చేశారు. బండి సంజయ్ ను మరికాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. పెద్దయెత్తున బీజేపీ కార్యకర్తలు చేరుకుంటుండటంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బండి సంజయ్ ను కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు.


Tags:    

Similar News