పులిని చంపింది వీళ్లేనట.. పోలీసుల అదుపులో ఐదుగురు

కొమురం భీం జిల్లా పెంచకల్ పేట మండలం ఎల్లూరు లో పులిని చంపిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

Update: 2025-05-20 04:27 GMT

కొమురం భీం జిల్లా పెంచకల్ పేట మండలం ఎల్లూరు లో పులిని చంపిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పులిని చంపినట్లు అనుమానించిన ఐదుగురిని అదుపులోకి తీసుకుని పోలీసులు, అటవీ శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. పులికి విద్యుత్తు వైర్లతో షాకిచ్చిన చంపిన తర్వాత దాని గోర్లు, శరీరాన్ని వేరు చేసి ఒకఇంట్లో పూడ్చిపెట్టినట్లు పోలీసులు గర్తించారు.

విద్యుత్తు వైర్లు అమర్చి...
విద్యుత్తు వైర్లు అమర్చిపులిని చంపినట్లు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా నిందితుడి ఇంటి సమీపంలోనే పులి కబేళరాన్ని పూడ్చి పెట్టారు. అయితే అధికారుల తనిఖీల్లో ఇది బయటపడటంతో దీనిని కే8 పులిగా అధికారులు భావించార. మొత్తం ఐదుగురు నిందతులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరిపై వన్యప్రాణ సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేసిన అటవీ శాఖ అధికారులు జరుపుతున్నారు.


Tags:    

Similar News