Telangana : బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్
బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.
బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. చలో బస్ భవన్ కు బీఆర్ఎస్ పిలుపు నివ్వడంతో బీఆర్ఎస్ నేతలను ముందుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ లను హౌస్ అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తుడటంతో బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు
చలో బస్ భవన్ కు...
ఆర్టీసీ ఛార్జీలను పెంచి ప్రజలపై భారం మోపారని, అందుకు నిరసనగా ప్రజల పక్షాన తాము చలో బస్ భవన్ కు పిలుపు నిస్తే ఈ ముందస్తు అరెస్ట్ లు ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు ఎన్నికల సమయలో ఇస్తామని చెప్పిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతూ, ఛార్జీల పెంచడాన్ని వారు తప్పుపడుతున్నారు.