Breaking : కాంగ్రెస్ హామీపై కోర్టుకు ఎక్కిన రైతు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీ అమలు చేయలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలయింది
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీ అమలు చేయలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. రైతుకలు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం జీవో 567 విడుదల చేసిందని, తనకు రూ. 1.50 లక్షల రుణం ఉన్నా కూడా మాఫీ కాలేదని పిటిషన్‌లో ఒక రైతు పేర్కొన్నారు. గత ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేసింది.
రుణమాఫీ కాలేదంటూ...
అయితే తనకు రుణమాఫీ కాలేదంటూ రైతు పిటీషన్ దాఖలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నరసింహారెడ్డి అనే రైతు ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిని విచారణకు హైకోర్టు స్వీకరించింది. తమకు కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వ న్యాయవాది సమయం కోరారు. దీంతో విచారణన హైకోర్టు వాయిదా వేసింది.