జోగులాంబ గద్వాల్ జిల్లాలో టెన్షన్
జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనకు దిగారు.
జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనకు దిగారు. దాదాపు పది గ్రామాలకు చెందిన ప్రజలు వచ్చి కంపెనీకి చెందిన వాహనాలను తగులపెట్టారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో భూగర్భజలాలు కలుషితమవుతాయని భావించి కంపెనీ తమకు వద్దని వారు ఆందోళనకు దిగారు. నిన్న రాత్రి కంపెనీ సిబ్బంది పనులను ప్రారంభించడానికి వాహనలు, కూలీలతో వచ్చారు.
ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా...
అక్కడనుంచి వెళ్లిపోవాలని గ్రామస్థులు చెప్పినా వినకపోవడంతో వాహనాలను కంటైనర్ ను తగలపెట్టారు. పనులు ప్రారంభిస్తున్నసమయంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మూడు నెలలక్రితం ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోయిందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహనాలను, కంటైనర్ లను తగలపెట్టడంతో పోలీసులు భారీగా అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.