Telangana : నేడు కులగణనపై పీసీసీ చీఫ్ సమావేశం
తెలంగాణలో కుల గణనపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతలతో సమావేశం కానున్నారు
caste enumeration in telangana
తెలంగాణలో కుల గణనపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీతో పాటు మంత్రులు, సీనియర్ నేతలు కూడా పాల్గొంటారు. ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానం పంపారు.
కీలక సమావేశంలో...
కులగణనపై ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోనున్నారు. అందరి అభిప్రాయాలను తీసుకోనున్నారు. వారి అభిప్రాయాలను సేకరించిన తర్వాత కులగణనపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల సమయంలో కులగణన చేస్తామన్న హామీ ఇచ్చిన మేరకు ఈ నిర్ణయం తీసుకోనుంది.