KCR : కన్నీరు పెట్టుకున్న కేసీఆర్

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ భౌతిక కాయాన్ని చూసిన పార్టీ అధినేత కేసీఆర్ కన్నీరు పెట్టుకున్నారు.

Update: 2025-06-08 06:36 GMT

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ భౌతిక కాయాన్ని చూసిన పార్టీ అధినేత కేసీఆర్ కన్నీరు పెట్టుకున్నారు. ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు వచ్చిన కేసీఆర్ విలపించారు. మాగంటి గోపీనాధ్ ఇంటికి చేరుకున్న కేసీఆర్ భౌతిక కాయంపై పుష్ప గుచ్ఛం ఉంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు.

కుమారుడిని దగ్గరకు తీసుకుని...
మాగంటి గోపీనాధ్ కుమారుడిని దగ్గరకు తీసుకున్నారు. కేసీఆర్ కన్నీటి పర్యంతం కావడంతో అక్కడ ఉన్న బీఆర్ఎస్ నేతలు సయితం కంటతడి పెట్టారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగా మాదాపూర్ లోని మాగంటి గోపీనాధ్ నివాసానికి చేరుకుని ఆయనకు నివాళుర్పించారు. సాయంత్రం నాలుగు గంటలకు మహా ప్రస్తానంలో మాగంటి బాబు భౌతిక కాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి.


Tags:    

Similar News