Telangana : నేటి నుంచి మద్యం దుకాణాల లైసెన్స్ లకు దరఖాస్తులు
తెలంగాణలో మద్యం షాపుల లైసెన్స్ కు నోటిఫికేషన్ జారీ అయింది.
తెలంగాణలో మద్యం షాపుల లైసెన్స్ కు నోటిఫికేషన్ జారీ అయింది. రాష్ట్రంలోని 2,620 మద్యం షాపుల లైసెన్స్ కు సంబంధించి ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈరోజు నుంచి వచ్చే నెల 18వ తేదీ వరకూ దరఖాస్తుల ప్రక్రియను స్వీకరించనున్నారు. అక్టోబరు 23వ తేదీన కొత్త దుకాణాలకు సంబంధించి లాటరీ ప్రక్రియ జరగనుంది.
డ్రా పద్ధతిలో...
ప్రభుత్వం మద్యం దుకాణాల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ, గీతకార్మికులకు డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయించనుంది. ఈసారి అత్యధిక ఆదాయం సమకూరుతుందని తెలంగాణ ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తుంది. మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు అమ్ముడు పోతాయని, పోటీ కూడా తీవ్రంగా ఉంటుందని, ప్రభుత్వానికి భారీ గానే ఆదాయం లభిస్తుందని భావిస్తుంది.