Telangana : నేటి నుంచి కొత్త మద్యం దుకాణాలు
నేటి నుంచి కొత్త మద్యం దుకాణాలు తెలంగాణలో ప్రారంభం కానున్నాయి.
నేటి నుంచి కొత్త మద్యం దుకాణాలు తెలంగాణలో ప్రారంభం కానున్నాయి. కొత్త మద్యం దుకాణాల్లో నేటి నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.ఇటీవల కొత్త మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానించిన ప్రభుత్వం లాటరీ పద్ధతిలో వారికి కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే డిసెంబరు ఒకటో తేదీ కావడంతో నేటి నుంచి కొత్త గా లైసెన్స్ పొందిన వారు మద్యం దుకాణాలను ప్రారంభించనున్నారు.
ప్రభుత్వానికి అధిక ఆదాయం...
ఒక్కో దరఖాస్తు ధరను మూడు లక్షల రూపాయలకు పెంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖాజానాకు అధికంగా ఆదాయం జమ అయింది. కొత్త మద్యం షాపులు రెండేళ్ల పాటు ఉండనున్నాయి. కొత్త షాపులకు గ్రామ పంచాయతీ ఎన్నికలు కలిసి వచ్చేలా చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండటంతో మద్యం అమ్మకాలు జోరుగా సాగనున్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి.