Telangana : నేడు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్. రామచంద్రరావు నేడు బాధ్యతలను స్వీకరించనున్నారు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్. రామచంద్రరావు నేడు బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈరోజు ఉదయం నివాసం నుంచి బయలుదేరి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని రామచందర్ రావు దర్శించుకున్నారు. ఆలయ పూజారులు ఆయనకు ప్రత్యేక స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భాగ్యలక్ష్మి అమ్మవారిని...
అనంతరం పార్టీ కార్యాలయానికి చేరుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించనున్నారు. కిషన్ రెడ్డి నుంచి ఆయన బాధ్యతలను స్వీకరించిన తర్వాత నేతలను కలుస్తారు. అనంతరం మధ్యాహ్నం 1గంటకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష హోదాలో మీడియా సమావేశంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి పెద్దయెత్తున బీజేపీ కార్యకర్తలు తరలి వచ్చారు.