మునుగోడు వైన్ షాపుల నిర్వాహకులకు వార్నింగ్
మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపులను ఎమ్మెల్యే అనుచరులు బెదిరిస్తున్నారు
మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపులను ఎమ్మెల్యే అనుచరులు బెదిరిస్తున్నారు. నిర్దేశించిన సమయానికే తెరవాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షరతులు పెట్టిన నేపథ్యంలో ఆయన అనుచరులు వైన్ షాపు యజమానులకు వార్నింగ్ లు ఇస్తున్నారు. ఎమ్మెల్యే చెప్పిన టైంకే వైన్ షాపులు తెరవాలని, లేదంటే షాపులు మొత్తానికి మూసేస్తామంటూ హెచ్చరిస్తున్నారు.
కోమటిరెడ్డి అనుచరులు...
మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు వైన్ షాపుల వాళ్లకు వార్నింగ్ ఇస్తున్నారు. నియోజకవర్గంలో వైన్ షాపులు మధ్యాహ్నం ఒంటి గంటకు.. పర్మిట్ రూమ్ సాయంత్రం 6 గంటలకు తెరవాలని రాజగోపాల్ రెడ్డి హుకుం జారీ చేయడంతో సంస్థాన్ నారాయణపూర్‌లో తెరిచి ఉన్న వైన్ షాపును కోమటిరెడ్డి అనుచరులు మూసివేశారు. దీంతో పోలీసులకు వైన్ షాపు నిర్వాహకులు ఫిర్యాదు చేశారు.