Telangana : నేడు భూదాన్ పోచంపల్లికి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు
మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు నేడు భూదాన్ పోచంపల్లిని సందర్శించనున్నారు.
మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు నేడు భూదాన్ పోచంపల్లిని సందర్శించనున్నారు. హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన అందాల భామలు వరసగా తెలంగాణలోని చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను చుట్టి వస్తున్నారు. బుద్ధపౌర్ణమి రోజున సాగర్ లోని బుద్ధవనం ప్రాజెక్టును సందర్శించిన ప్రపంచ సుందరీమణులు, తర్వాత రోజు చార్మినార్ ను సందర్శించి అక్కడ గాజులు కొనుగోలు చేశారు.
యాదాద్రికి కూడా...
నిన్న వరంగల్ లోని వేయి స్థంభాల దేవాలయం, రామప్పగుడిని సందర్శించారు. సంప్రదాయ దుస్తుల్లో వారు దర్శించుకున్నారు. నేడు భూదాన్ పోచంపల్లికి ప్రపంచ సుందరీమణులు వెళ్లనున్నారు. అక్కడ చేనేత వస్త్రాల తయారీని చూడనున్నారు. దీంతో పాటు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని కూడా దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు.