Telangana : యాదగిరిగుట్టలో ప్రపంచ సుందరీమణులు
మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారు.
మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన వారికి ఆలయ ఆధికారులు, వేద పండితులు స్వాగతం పలికారు. చీరకట్టులో వచ్చిన అందాల భామలు యాదగిరిగుట్ట ఆలయాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వారి పర్యటనల సందర్భంగా సాధారణ భక్తుల దర్శనాలకు కొంతసేపు బ్రేక్ ఇచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోలాటాలతో వారికి స్వాగతం పలికారు. ఆలయంలో అఖండ దీపారాథనలో పాల్గొన్నారు.
భూదాన్ పోచంపల్లిలో కూడా...
మరొక బృందం భూదాన్ పోచంపల్లిని కూడా దర్శించింది. ఆఫ్రికన్ దేశాలకు చెందిన ఇరవైఐదు మంది సుందరీమణులు భూదాన్ పోచంపల్లికి వచ్చి అక్కడ చీరాల తయారీ ని దగ్గరుండి చూశారు. నేత కార్మికులను అడిగి తెలుసుకున్నారు. చీర మగ్గంపై ఎలా నేస్తున్నారో తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఎంపిక చేసిన కేంద్రాల్లో పర్యటించిన అనంతరం రాత్రి ఎనిమిది గంటలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళతారు. భూదాన్ పోచంపల్లికి సంబంధించి పర్యటనలో అధికారుల భారీ భద్రతను ఏర్పాటు చేశారు.