Hyderabad : నేటి నుంచి హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు

హైదరాబాద్ లో నేటి నుంచి మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభ వేడుకలను నిర్వహించనున్నారు

Update: 2025-05-10 01:53 GMT

హైదరాబాద్ లో నేటి నుంచి మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభ వేడుకలను నిర్వహించనున్నారు. మిస్ వరల్డ్ పోటీలకోసం రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే వివిధ దేశాలకుచెందిన అందాల భామలు హైదరాబాద్ కు చేరుకున్నారు. తొలిసారి హైదరాబాద్ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిధ్యమిస్తుంది. ఈ పోటీల్లో మొత్తం 120 దేశాలకు చెందిన యువతులు పాల్గొననున్నారు. అ

భారీబందోబస్తు మధ్య...
యితే ఇప్పటికే 111 మంది నగరానికి చేరుకున్నారు. మిగిలిన వారు నేడు చేరుకునే అవకాశముంది. వీరు బస చేసిన హోటల్స్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాక్ - భారత్ ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. మిస్ వరల్డ్ లిమిటెడ్ ఈ పోటీలను నిర్వహిస్తుంది. ప్రారంభ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించనున్నారు. ఈ నెల 31వ తేదీన హైటెక్స్ లో గ్రాండ్ ఫినాలే జరుగుతుంది.


Tags:    

Similar News