వరదల్లో మృతిచెందిన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా : మంత్రి సత్యవతి

జంపన్నవాగు ఉద్ధృతి తగ్గడంతో కొండప్రాంతాల్లో ఉన్నవారిని పునరావాస కేంద్రాలను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Update: 2023-07-28 11:34 GMT

ములుగు జిల్లా కొండాయి, మల్యాల గ్రామాల్లో వరదల్లో చిక్కుకున్న వారికోసం రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. జంపన్నవాగు ఉద్ధృతి తగ్గడంతో కొండప్రాంతాల్లో ఉన్నవారిని పునరావాస కేంద్రాలను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్నవారికి ఆహారం, మంచినీటిని హెలికాఫ్టర్ల ద్వారా అందిస్తున్నారు. నిన్న జంపన్నవాగులో సుమారు 8 మంది గల్లంతవ్వగా ఉదయం ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. తాజాగా మరో ముగ్గురి మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు.

జంపన్నవాగు ఉద్ధృతి తగ్గడంతో ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను చూసి వారికుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వరదల్లో గల్లంతై, మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్రప్రభుత్వం తరపున రూ.4 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. తక్షణ సహాయం కింద రూ.25 వేలు అందజేస్తామన్నారు. అలాగే వరదల కారణంగా నష్టపోయిన కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.


Tags:    

Similar News