Telangana : పది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్.. మంత్రి చెప్పేశారుగా
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్లారిటీ ఇచ్చారు
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ నెల పదిహేనో తేదీ లోపు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. కులగణనపై ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక అందిందన్న పొంగులేటి ఈ నెల 4వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నామని చెప్పారు. రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకున్న తర్వాత ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి తొలి వారంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు.
క్యాడర్ అలెర్ట్ గా ఉండాల్సిందే...
పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరిచారు. అలాగే రాష్ట్రంలో అర్హులందరికీ పథకాలు అందుతాయని ఆయన రెండు లేదా మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు. ఇరాష్ట్రంలో మొత్తం 12,845 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, 1,13,328 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు.