బండి సంజయ్ పై పరువునష్టం దావా వేసిన మంత్రి కేటీఆర్

కేటీఆర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. మంత్రి పై నిరాధారమైన ఆరోపణలు చేసి, ఆయన పాపులారిటీని దెబ్బతీయాలని..

Update: 2022-05-13 12:00 GMT

హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ పరువునష్టం ద్వారా వేశారు. ఈ మేరకు తన న్యాయవాదితో బండి సంజయ్ కు నోటీసులు పంపారు. మే 11న ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ పై బండి సంజయ్ నిరాధారమైన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలుంటే చూపాలని, లేనిపక్షంలో బహిరంగ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దానిపై బండి సంజయ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో..కేటీఆర్ నేడు పరువునష్టం దావా వేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. మంత్రి పై నిరాధారమైన ఆరోపణలు చేసి, ఆయన పాపులారిటీని దెబ్బతీయాలని బండి సంజయ్ అబద్ధాలు చెప్తున్నారన్నారు. జాతీయ పార్టీ తరపున తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిదికాదన్నారు. మంత్రి కేటీఆర్ పరువుకు నష్టంకలిగేలా అసత్య వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం నష్టపరిహారం చెల్లించడంతో పాటు. చట్టప్రకారం తగు చర్యలు తీసుకునేందుకు అర్హులవుతారని నోటీసులో తెలిపారు. 48 గంటల్లోగా కేటీఆర్ కు బండిసంజయ్ క్షమాపణలు చెప్పని పక్షంలో తదుపరి చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.





Tags:    

Similar News