Komatireddy : కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్
కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. సోనియా గాంధీ కాళ్లు మొక్కని వ్యక్తి కేసీఆర్ అన్నారు. సోనియా గాంధీ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అన్నారు. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కేసీఆర్ పాలనలో అవినీతి అధికారులు కొందరు జైలులో ఉండగా, మరికొందరు అమెరికాలో తలదాచుకున్నారని అన్నారు.
డబ్బు ఉందన్న అహంకారంతో...
వారిని పట్టుకునేందుకు ఎంత సమయం పడుతుందన్నది ఇప్పుడే చెప్పలేమన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ గతాన్ని మర్చిపోయి మాట్లాడారన్నారు. కేవలం డబ్బు ఉందన్న అహంకారంతో జనాన్ని పోగు చేసి మరీ సభపెట్టుకుని జబ్బలు చరుచుకుంటే ప్రయోజనం ఏంటని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని ఎవరూ ఆపలేరని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.