Operation Sindoor : ఆపరేషన్ సింధూర్ పై ఒవైసీ ఏమన్నారంటే?

ఆపరేషన్ సింధూర్ పై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఎక్స్ లో స్పందించారు.

Update: 2025-05-07 03:37 GMT

ఆపరేషన్ సింధూర్'పై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఎక్స్ లో స్పందించారు. పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై మన రక్షణ దళాలు నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ స్వాగతిస్తున్నానంటూ ఆయన పేర్కొన్నారు. మరో పహల్గామ్ ఘటన జరగకుండా పాకిస్తాన్ కు గట్టి గుణపాఠం నేర్పాలని అసదుద్దీన్ ఒవైసీ ఎక్స్ లో అభిప్రాయపడ్డారు.

ఉగ్రవాద మౌలిక సదుపాయాలను...
పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలని తాను కోరుకుంటున్నానని .. జై హింద్ అంటూ అసదుద్దీన్ ఒవైసీ ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఉగ్రవాదుల దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.


Tags:    

Similar News