మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు.. చిరంజీవి ట్వీట్
సింగపూర్ స్కూలు ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ ఇంటికి చేరుకున్నాడని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు
సింగపూర్ స్కూలు ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ ఇంటికి చేరుకున్నాడని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. తమ బిడ్డ తమ కులదైవం ఆంజనేయస్వామి దయతో ప్రమాదం నుంచి బయటపడ్డాడని తెలిపార. ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేశారు. రేపు హనుమత్ జయంతి సందర్భంగా శంకర్ ఇంటికి చేరుకోవడం నిజంగా హనుమాన్ ఆశీస్సులేనని ఆయన తెలిపారు.
ప్రమాదం నుంచి...
శంకర్ ప్రమాదం నుంచి బయటపడాలని ప్రజలు కోరుకున్నారని, వారి అభిలాష ఫలించిందని చిరంజీవి పేర్కొన్నారు. అయితే ఇంటికి చేరుకున్నప్పటికీ శంకర్ ఇంకా కోలుకోవాల్సి ఉందని తెలిపారు. తమ బిడ్డ శంకర్ క్షేమంగా ప్రమాదం నుంచి బయటపడాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లు ఆయన తెలిపారు.