మహారాష్ట్ర పులులు తెలంగాణలోకి రాబోతున్నాయ్!!

తెలంగాణ రాష్ట్రంలోని కవ్వాల్‌ ప్రాంతంలోని టైగర్‌ రిజర్వు ఫారెస్ట్‌ లో ప్రస్తుతం ఒక్క పులి కూడా లేదు.

Update: 2025-06-28 11:45 GMT

తెలంగాణ రాష్ట్రంలోని కవ్వాల్‌ ప్రాంతంలోని టైగర్‌ రిజర్వు ఫారెస్ట్‌ లో ప్రస్తుతం ఒక్క పులి కూడా లేదు. దీంతో మహారాష్ట్రలోని తాడోబా అభయారణ్యం నుంచి పులులను కవ్వాల్‌కు తీసుకురానున్నారు. ‘ప్రాజెక్ట్‌ టైగర్‌’ పేరిట రాష్ట్ర అటవీశాఖ చేపట్టే ఈ ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించనుంది. దీనిపై క్షేత్ర పరిశీలన కోసం ‘నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ’ అధికారులు జులై తొలివారంలో కవ్వాల్‌కు రానున్నారు. కవ్వాల్‌ ప్రాంతంలో అప్పుడప్పుడు పులులు వచ్చి వెళుతూ ఉండగా, మహారాష్ట్రలో మాత్రం భారీ సంఖ్యలో పులులున్నాయి. ఆసిఫాబాద్‌ జిల్లాకు సరిహద్దులో ఉన్న తాడోబా టైగర్‌ రిజర్వులో 40కి పైగా, ఆదిలాబాద్‌ పక్కనే ఉన్న ఇంద్రావతి నేషనల్‌ పార్కులో 20కి పైగా ఉన్నాయి. ఈ నేపథ్యంతో అక్కడున్న పెద్దపులులను ఇక్కడికి తరలించాలని తెలంగాణ అటవీశాఖ కోరింది.

Tags:    

Similar News