Revanth Reddy : నేడు కొడంగల్ కు రేవంత్ రెడ్డి
నేడు కొడంగల్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు.
నేడు కొడంగల్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు బయలుదేరి వెళ్లనున్నారు. కొడంగల్ లోని కోస్గిలో సర్పంచులు, వార్డు సభ్యులకు సన్మానంలో ఆయన పాల్గొంటారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ లతో రేవంత్ రెడ్డి సమావేశమవుతారు.
సర్పంచ్ లతో కలసి...
సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్ వారికి గ్రామాభివృద్ధి కోసం పనిచేయడంపై దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీలకు రహితంగా కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని పిలుపు నివ్వనున్నారు. అనంతరం కొత్త సర్పంచులతో రేవంత్ రెడ్డి భోజనం చేయనున్నారు.రేవంత్ రెడ్డి పర్యటనతో కొడంగల్ లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు