5 ఏళ్ల బాలిక ప్రాణాలు తీసిన పిచ్చి కుక్క

కొత్తగూడెం జిల్లాలో ఓ పిచ్చికుక్క కారణంగా ఐదేళ్ల బాలిక ప్రాణాలు పోయాయి.

Update: 2025-05-29 14:05 GMT

కొత్తగూడెం జిల్లాలో ఓ పిచ్చికుక్క కారణంగా ఐదేళ్ల బాలిక ప్రాణాలు పోయాయి. లక్ష్మీదేవిపల్లికి చెందిన బానోత్‌ రమేశ్‌, స్వప్న దంపతుల ఐదేళ్ల కుమార్తె నిహారిక గాయత్రి మే 13న ఇంటి ముందు ఆడుకుంటుండగా ఓ పిచ్చికుక్క దాడి చేసింది. కుటుంబసభ్యులు కొత్తగూడెంలోని జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యం చేసిన డాక్టర్లు వ్యాక్సిన్‌ వేసి, మందులిచ్చి ఇంటికి పంపారు.


మే 25న ఆ చిన్నారి వింతగా ప్రవర్తిస్తుండటం, నోట్లో నుంచి నురగలు వచ్చాయి. వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి అక్కడి నుండి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది.

Tags:    

Similar News