Telangnana : మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు
తెలంగాణలో మద్యం షాపులకు భారీగా దరఖాస్తులు అందాయి.
తెలంగాణలో మద్యం షాపులకు భారీగా దరఖాస్తులు అందాయి. మొత్తం 95,137 దరఖాస్తులు అందాయి. 2,620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు చేరాయి. అత్యధికంగా రంగారెడ్డి డివిజన్‌లో 29,420 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. అత్యల్పంగా ఆదిలాబాద్ డివిజన్‌లో 4,154 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. నిన్నటితో దరఖాస్తుల స్వీకరణ గడువు పూర్తయింది.
ఎల్లుండి డ్రా...
ఈ నెల 27న ఉదయం 11 గంటలకు మద్యం షాపులకు డ్రా ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. గౌడ, ఎస్సీ, ఎస్టీలకు కొన్ని దుకాణాలను కేటాయించనున్నారు. మద్యం దుకాణాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి దరఖాస్తులు చేయడంతో ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి సుమారు 2,800 కోట్ల రూపాయలకు పైగానే ఆదాయం వచ్చిందని చెబుతున్నారు.