Telangana : నేటి నుంచి మద్యం దుకాణాలు బంద్
నేటి నుంచి మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి.
నేటి నుంచి మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. తెలంగాణలో ఈ నెల 11వ తేదీన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 11న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ వరకు వైన్స్, బార్లు, రెస్టారెంట్లు మూసివేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
12వ తేదీ నుంచి...
తిరిగి 12వ తేదీ ఉదయం నుంచి మద్యం దుకాణాలు తెరుచుకోవచ్చని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గ్రామ పంచాయతీలకు తొలి విడత ఎన్నికలు 11వ తేదీన జరిగి, అదే రోజు కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. ఎవరైనా ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.