ఐదుగురిని చంపేసిన చిరుతపులి...అటవీశాఖ అధికారుల అలెర్ట్

తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో చిరుతపులి కదలికలు కలకలం రేపుతున్నాయి. నాలుగు రోజుల్లోనే ఐదుగురిని చిరుతపులి చంపేసింది

Update: 2025-05-13 05:32 GMT

తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో చిరుతపులి కదలికలు కలకలం రేపుతున్నాయి. నాలుగు రోజుల్లోనే ఐదుగురిని చిరుతపులి చంపేసింది. దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుత పులి జాడ కోసం వెదుకుతున్నారు. అనేక ప్రాంతాల్లో చిరుతపులి కోసం బోన్లను ఏర్పాటు చేశారు. చిరుత పులి కదలికలను గమనించేందుకు ప్రత్యేకంగా చెట్లకు కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు.

ఆదిలాబాద్ జిల్లాలో...
చిరుతపులి కదలికలు ఉన్న ఆదిలాబాద్ జిల్లాల్లో ఎవరూ అడవుల్లోకి వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు తెలిపారు. తూనీకాకు కోసం మహళలు ఎక్కువగా అటవీ ప్రాంతంలోకి వెళతారు. అయితే చిరుతపులి ఇప్పటికే ఐదుగురిని చంపడంతో ఎవరూ వెళ్లవద్దని అధికారులు ఆదేశించారు. చిరుతపులిని బంధించేంత వరకూ తగిన జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు.


Tags:    

Similar News