దావోస్ ఒప్పందాలపై కిషన్ రెడ్డి ఏమన్నారో తెలుసా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై కిషన్‌రెడ్డి స్పందించారు.

Update: 2025-01-24 12:22 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై కిషన్‌రెడ్డి స్పందించారు. లాభం చేకూరుతుందంటే ఎలాంటి విమర్శలు అవసరం లేదన్న ఆయన తెలంగాణ వారినే దావోస్‌ తీసుకెళ్లి అక్కడ అగ్రిమెంట్లు చేసుకోవడం ఏంటని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. విదేశాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని తాము కూడా కోరుకుంటున్నామని, ఒప్పందాలు పేపర్‌కే పరిమితం కాకూడదని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

రియల్టర్లను, పారిశ్రామికవేత్తలను...
తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను వేధిస్తోందని, పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని, కొందరు రియల్‌ ఎస్టేట్ రంగాన్ని వదిలేస్తామంటున్నారంటూ కిషన్ రెడ్డి ఆరోపించారు. పారిశ్రామికవేత్తలు, రియల్టర్లపై గత ప్రభుత్వం పక్షపాతం చూపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని కిషన్‌రెడ్డి అన్నారు. దావోస్ లో జరిగిన ఒప్పందాలన్ని అమలు చేయాలని ఆయన కోరారు.


Tags:    

Similar News