నేడు గవర్నర్ కు ఫార్ములా ఈ కారు రేసు కేసు నివేదిక

ఫార్ములా ఈ కారు రేసు కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశముంది. ఈరోజు గవర్నర్ కు ఏసీబీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం సమర్పించనుంది

Update: 2025-09-10 02:21 GMT

ఫార్ములా ఈ కారు రేసు కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశముంది. ఈరోజు గవర్నర్ కు ఏసీబీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం సమర్పించనుంది. ఇప్పటికే తొమ్మిది నెలల పాటు ఫార్ములా ఈ కారు రేసు కేసును విచారించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు దీనిపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించారు. నివేదికను చీఫ్ సెక్రటరీకి అందచేశారు.

ప్రాసిక్యూషన్ కోసం...
ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తదుపరి చర్యలపై మంత్రులు కోరినట్లు తెలిసింది. అయితే గవర్నర్ కు ఏసీబీ నివేదికను నేడు అందించి నిందితుల ప్రాసిక్యూషన్ కు అనుమతి కావాలని కోరాలని రేవంత్ ఆదేశించినట్లు సమాచారం. ఈ నివేదికలో కేటీఆర్ తో సహా మరో నలుగురుపై ప్రాసిక్యూషన్చేయాలని ఏసీబీ భావిస్తుంది. గవర్నర్ నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఈ కేసులో ఛార్జిషీటు దాఖలు చేసే అవకాశముంది. ఇందులో కేటీఆర్ తో పాటు మరో నలుగురు అధికారుల పేర్లను ప్రస్తావించినట్లు సమాచారం.


Tags:    

Similar News