KCR : ఒక్క ఓటమితోనే కొట్టుకుపోయినట్లా.. ప్రశ్నించిన కేసీఆర్
ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు
ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.రాష్ట్రమంతా ఘనంగా ఈ వేడుకలను జరపాలని కోరారు. తెలంగాణ భవన్ లో జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన కేసీఆర్ ఈసారి తెలంగాణలో వంద శాతం అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణను సంబంధిత నేతలు దగ్గరుండి చూసుకోవాలన్నారు. టీఆర్ఎస్ ప్రస్థానం మొదలయిన నాటి నుంచి నేటి వరకూ జరిగిన పరిణామాలను కూడా కేసీఆర్ నేతలకు వివరించారు.
పోరాడి తెచ్చుకున్న తెలంగాణ...
ఒక్క ఓటమితో కొట్టుకుపోయే పార్టీ కాదన్న కేసీఆర్ ప్రజల కోసం సాధించి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధిలో వెనకంజలో పడటం ఆందోళనకు గురి చేస్తుందన్నారు. త్వరలో ఉపఎన్నికలు వచ్చే అవకాశముందని కూడా కేసీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తాము అమలు చేసిన సంక్షేమ పథకాలతో నాడు సస్యశ్యాలంగా ఉన్న తెలంగాణ నేడు అన్ని రకాలుగా భ్రష్టుపట్టిపోయిందని అన్నారు. హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమయిందన్నారు. ప్రజల కోసం నిత్యం పోరాటం చేయాలని కేసీఆర్ పిలుపు నిచ్చారు.