Kalvakuntla Kavitha : నేడు విదేశాలకు కల్వకుంట్ల కవిత

విదేశాల్లో బతుకమ్మ వేడుకలకు హాజరయ్యేందుకు నేడు కల్వకుంట్ల కవిత బయలుదేరి వెళ్లనున్నారు.

Update: 2025-09-25 02:55 GMT

విదేశాల్లో బతుకమ్మ వేడుకలకు హాజరయ్యేందుకు నేడు కల్వకుంట్ల కవిత బయలుదేరి వెళ్లనున్నారు. ఈ రోజు ఉదయం ఢిల్లీకి బయల్దేరి సాయంత్రం ఢిల్లీ నుంచి ఖతార్ కు వెళ్లనున్నారు. ఈ రోజు హర్యానాలో మాజీ ఉప ప్రధాని దేవిలాల్ జయంతి వేడుకలకు హాజరు కానున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విదేశీ పర్యటనకు రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో నేడు యలుదేరి వెళ్లనున్నారు.

బతుకమ్మ సంబరాల్లో ...
26వ తేదీన ఖతార్ లో తెలంగాణ జాగృతి ఖతార్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ సంబురాల్లో కల్వకుంట్ల కవిత పాల్గొంటారు. 7న మల్టాకు చేరుకొని తెలంగాణ జాగృతి మాల్టా శాఖ నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారు. అనంతరం ఈ నెల 28న లండన్ కు చేరుకుంటారు.. తెలంగాణ జాగృతి యూకే శాఖ నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారు.


Tags:    

Similar News