రాజీనామాను ఆమోదించండి : కల్వకుంట్ల కవిత

శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి తన రాజీనామా ఆమోదం గురించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చర్చించారు

Update: 2026-01-02 12:11 GMT

శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి తన రాజీనామా ఆమోదం గురించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చర్చించారు.తన రాజీనామాకు కారణాలను హౌస్ లో చెప్పే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 5, 6 తేదీల్లో ఏదో ఒకరోజు అవకాశం ఇస్తానని మండలి చైర్మన్ తెలిపారు. ముఖ్యమంత్రి తన మాట తీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నానన్నారు. పాలమూరు-రంగారెడ్డి ద్వారా ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదన్నది నూటికి వెయ్యి శాతం నిజమని అన్నారు.

ఆరోజు చెబుతా....
ఇన్ టేక్ పాయింట్ ఎందుకు మార్చారో కేసీఆర్ వివరించాలన్నారరు. బబుల్ షూటర్ కు పెత్తనం ఇచ్చి సమాధానం చెప్పిస్తే ప్రజలకు అర్థం కాదని, కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ ను దేవుడు కూడా కాపాడలేడన్నారు. ఆంధ్రా నాయకులు రాజకీయాలకు అతీతంగా మన నీళ్లు దోచుకుంటున్నారని, తెలంగాణ నాయకులకు మాత్రం ఎందుకు ఆ చిత్తశుద్ధి లేదన్న కవిత తన రాజీనామా ఆమోదించే ముందు కౌన్సిల్ లో మాట్లాడే అవకాశం కోరానని కల్వకుంట్ల కవిత మీడియాతో చెప్పారు. ఈ నెల 5వ తేదీన కౌన్సిల్ లో మాట్లాడుతానని, తన రాజీనామాకు కారణాలను ప్రజలకు వివరిస్తానని కల్వకుంట్ల కవిత తెలిపారు.


Tags:    

Similar News