Revanth Reddy : నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లే అవకాశముంది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లే అవకాశముంది. పార్టీ పెద్దలను కలిసేందుకు ఈరోజు మధ్యాహ్నం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళతారని సమాచారం. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడం, ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించకపోవడంతో దానిపై చర్చించేందుకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారని తెలిసింది.
పార్టీ పెద్దలను కలసి...
పార్టీ పెద్దలను కలసి రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చించిన తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకునే అవకాశాలున్నాయి. అయితే దీనిపై అధికారిక సమాచారం అయితే ఏదీ లేదు. మరొకవైపు రాజ్యసభ స్థానాలు తెలంగాణలో రెండు ఖాళీ అవుతున్నాయి. రెండింటిలోనూ కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులే గెలిచే అవకాశముండటంతో ఇప్పటికే కొందరు ఢిల్లీలో తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు.