Kalvakuntla Kavitha : కవితక్క షరతులు విని షాక్ అయిన కేసీఆర్..అవి ఏంటంటే?
కల్వకుంట్ల కవిత కూడా పార్టీలో ఐడెంటెటీ కోసం గట్టి పోరాటం చేయాలనే నిర్ణయించుకున్నట్లుంది
ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ సభ్యులే చివరకు పొలిటికల్ విలన్లుగా మారతారు. ఎందుకో తెలియదు కానీ దేశంలో అనేక ప్రాంతీయ పార్టీల్లో కుమారులు, కుమార్తెలు పార్టీని చీల్చిని ఘటనలు ఎన్నో ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకుంటే నిన్న వైసీపీ, నేడు బీఆర్ఎస్ లు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. వైసీపీలో వైఎస్ షర్మిల తన సొంత సోదరుడు జగన్ కు వ్యతిరేకంగా పార్టీ పెట్టడం, తర్వాత దానిని వదిలేసి జాతీయ పార్టీ కాంగ్రెస్ లో చేరి జగన్ ఓటమికి మొన్నటి ఎన్నికల్లో కారణమయ్యారు. ఇప్పుడు కవిత కూడా పార్టీలో ఐడెంటెటీ కోసం గట్టి పోరాటం చేయాలనే నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అందుకే కల్వకుంట్ల కవిత వేరే పార్టీ పెట్టుకునేందుకు కూడా సిద్ధమయ్యారని తెలిసింది.
కొత్త పార్టీ ఏర్పాటుకు...
ఇప్పటికే ఎన్టీపీసీ బొగ్గు గనులకు సంబంధించి తెలంగాణ జాగృతితో వేరే విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా బీఆర్ఎస్ కు కవిత గట్టి షాక్ ఇచ్చినట్లయింది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు తనకు కాని, తన అనుచరులకు గాని పదవులు ఇవ్వకపోవడాన్ని ఆమె తప్పుపడుతున్నారు. పార్టీ విజయం కోసం తాను ఎంత కష్టపడినా దానికి సరైన గుర్తింపు కనీసం తన తండ్రి గుర్తించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. భవిష్యత్ లోనూ పార్టీలో కేటీఆర్ చెప్పినట్లే అంతా జరుగుతుందని, తనను కేవలం పావుగా వాడుకునేందుకు చూస్తున్నారని కవిత బలంగా నమ్ముతున్నారు. అందుకే ఆమె ప్రత్యేకంగా పార్టీ పెట్టుకోవాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది.
కేసీఆర్ ఫోన్ చేసినప్పటికీ...
కేసీఆర్ ఫోన్ చేసినప్పటికీ కవిత సరిగా రెస్పాన్స్ చేయకపోవడంతో దీనికి మరింత బలం చేకూరుతుంది. జూన్ రెండో తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకల సందర్భంగా కొత్త పార్టీని ప్రకటించి నేరుగా ప్రజల్లోకి వెళ్లాలన్నది కవిత ప్లాన్ గా ఉంది. అవసరమైతే తెలంగాణ వ్యాప్తంగా కేటీఆర్ కంటే ముందుగా పాదయాత్ర చేయాలని కూడా కవిత రెడీ అవుతున్నట్లు తెలిసింది. సామాజిక తెలంగాణ నినాదంతో జనంలోకి వెళ్లి వేరు కుంపటి పెట్టుకోవాలని కవిత డిసైడ్ అయ్యారంటున్నారు. కొత్త పార్టీకి సంబంధించిన జెండా.. అజెండా లు కూడా సిద్ధమవుతున్నట్లు పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. కవిత వేరు కుంపటి పెడితే అది బీఆర్ఎస్ కు నష్టం చేకూరుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
రాజీ ప్రయత్నాలు విఫలం...
కొత్త పార్టీ దిశగా కల్వకుంట్ల కవిత అడుగులు వేస్తున్నారు. జూన్ 2న కొత్త పార్టీ ప్రకటన ఖాయమని తెలంగాణ జాగృతి నేతలు బహిరంగంగానే చెబుతన్నారు.కేసీఆర్ తనకు దగ్గర వారితో కవిత వద్దకు రాజీ కోసం చేసిన ప్రయత్నాలు, చర్చలు విఫలం అయినట్లు తెలిసింది. ఇప్పటికే పలు కమిటీలను ఏర్పాటు చేసుకున్న కవిత వరుసగా జాగృతి నేతలతో కవిత సమావేశాలు నిర్వహిస్తున్నారు. బహుజన సామాజిక తెలంగాణ పేరిట కొత్త పార్టీ పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తుండటంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్రమత్తమయ్యారు. అయితే తనకు బీఆర్ఎస్ లో ఏ రకమైన పదవి ఇస్తారని? తన వారికి ఎలాంటి పదవులు ఇస్తారంటూ కవిత ప్రశ్నించినట్లు తెలిసింది.