కలిసొచ్చేనా.. తెలుగు రాష్ట్రాలకు కొత్తగా బీజేపీ అధ్యక్షులు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పదవికి మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు పేరు ఖరారైంది.
BJP
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పదవికి మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు పేరు ఖరారైంది. ఈ మేరకు నామినేషన్ వేయాలని పార్టీ అధిష్ఠానం ఆయన్ను ఆదేశించింది. దీంతో రామచందర్‌రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రామచందర్‌రావు పేరును ఆరెస్సెస్ విభాగంతో పాటు కొందరు సీనియర్ నేతలు బలంగా ప్రతిపాదించినట్లు తెలిసింది.
ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై కూడా పార్టీ అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుంది. మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ వైపు బీజేపీ అధినాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. గతంలో శాసన మండలిలో భాజపా ఫ్లోర్ లీడర్‌గా మాధవ్ పనిచేశారు. ఆయన నామినేషన్ వేయనున్నారు.