Telangana : మళ్లీ కాళేశ్వరం కమిషన్ విచారణ

మళ్లీ కాళేశ్వరం కమిషన్ విచారణ ప్రారంభమైంది.

Update: 2025-05-16 07:27 GMT

మళ్లీ కాళేశ్వరం కమిషన్ విచారణ ప్రారంభమైంది. హైదరాబాద్ చేరుకున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ మరో రెండు వారాల పాటు హైదరాబాద్ లోనే ఉంటారు. హైదరాబాద్ లోనే ఉండి కమిషన్ కు సంబంధించిన తుది రిపోర్టును రూపొందిస్తారని తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్దయెత్తున అవినీతి జరిగిందని జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్ ను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే.

తుది నివేదికను...
దీనిపై అధికారులను విచారించిన కమిషన్ ప్రభుత్వానికి తుది రిపోర్టు ఇవ్వనుంది. ఈ నెల 31వ తేదీతో కాళేశ్వరం కమిషన్ గడువు ముగియనుండటంతో రెండు వారాల్లో తుది నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి జస్టిస్‌ పీసీ ఘోష్‌ ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును గత ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News