Kalavakuntla Kavitha : తుమ్మలపై కవిత సంచలన కామెంట్స్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తుమ్మల నాగేశ్వరరావును బయటకు పంపి బీఆర్ఎస్ నాయకత్వం పెద్ద తప్పు చేసిందని కల్వకుంట్ల కవిత అభిప్రాయపడ్డారు. అందువల్లనే ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ బలహీనంగా పడిందని కవిత చెప్పారు. సీనియర్ నాయకుడిగా ఆయన సేవలను వినియోగించుకోవాల్సిన పార్టీ బయటకు పంపించడం వల్లనే బీఆర్ఎస్ భారీ మూల్యాన్ని చెల్లించుకుందని కల్వకుంట్ల కవిత అన్నారు.
ఆయన ఉండి ఉంటే...
ఆయన ఉండి ఉంటే బీఆర్ఎస్ కు గత ఎన్నికల్లో కొన్ని సీట్లు అయినా వచ్చేవన్నారు. తాను కొత్త పార్టీ పెట్టడంపై ఆలోచన లేదని తెలిపారు. పార్టీ పెట్టాలని నిర్ణయించుకుంటే ఖచ్చితంగా చెబుతానని అన్నారు. పార్టీ పెట్టాలంటే అందరితో చర్చించి చేస్తానని తెలిపారు. ప్రస్తుతం తాను జిల్లాల పర్యటనలో ఉన్నానని, అవి పూర్తయిన తర్వాత మాత్రమే తన రాజకీయ నిర్ణయం ప్రకటిస్తానని కల్వకుంట్ల కవిత తెలిపారు.