కాంగ్రెస్ ప్రభుత్వాన్నైనా నిలదీస్తాం : ఉత్తమ్

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆల్మట్టి ఎత్తు పెంపుదలపై తమ నిరసనను తెలియజేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Update: 2025-09-23 07:50 GMT

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆల్మట్టి ఎత్తు పెంపుదలపై తమ నిరసనను తెలియజేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కృష్ణా ట్రైబ్యునల్ లో రాష్ట్రం తరుపున బలమైన వాదనలను వినిపిస్తామని తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ ట్రైబ్యునల్ ఎదుట వాదనలను స్వయంగా తాను పరిశీలించడానికే ఢిల్లీకి వచ్చినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

కృష్ణా జిలాల్లో తెలంగాణకు...
కృష్ణా జిలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాను దక్కించుకునేలా ప్రయత్నిస్తామని తెలిపారు. ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ తమకు సంబంధం లేదన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తమకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పారు. 780 టీఎంసీలను తమ రాష్ట్రానికి కేటాయించాలని తమ ప్రభుత్వం కోరుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.


Tags:    

Similar News