రైతుల ఖాతాల్లో కోట్లలో నగదు... విచారణ చేస్తే?

అమాయక ఆదివాసీ రైతులను బ్యాంకు సిబ్బంది మోసం చేస్తున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది.

Update: 2022-02-20 04:13 GMT

అమాయక ఆదివాసీ రైతులను బ్యాంకు సిబ్బంది మోసం చేస్తున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. తెలంగాణ గ్రామీణ బ్యాంకు లో ఒక రైతు ఖాతాలో అరవై కోట్లు పడ్డాయి. అయితే ఆ రైతు తన బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు నుంచి ఐదు లక్షల రూపాయలను ఇంటి నిర్మాణం కోసం వాడుకున్నారు. బ్యాంకు అధికారులు రికవరీకి దిగడంతో ఆ బాగోతం బయటపడింది. ఆదిలాబాద్ జిల్లాలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఈ ఘటన చోటు చేసుకుంది.

అమాయక రైతుల ....
రైతులు కొడప భీంరావు, మడావి రాంబాయి, కొడప గంగాదేవి కిసాన్ క్రెడిట్ కార్డుల నుంచి 1.28 కోట్లు డ్రా అయినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. దీంతో బ్యాంకు సిబ్బంది ఆరా తీయగా తాము విత్ డ్రా చేయలేదని వారు చెప్పడంతో బ్యాంకు అధికారులు విచారణ ప్రారంభించారు. అయితే కస్టమర్ సర్వీస్ పాయింట్ నిర్వాహకుడు రమేష్ విడతల వారీగా ఈ డబ్బును డ్రా చేసినట్లు అధికారులు గుర్తించారు. నాలుగు నెలలుగా నగదును డ్రా చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు.


Tags:    

Similar News