Telangana : కాంగ్రెస్ లో మొదలయిన బుజ్జగింపుల పర్వం

మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలను పార్టీ నాయకత్వం బుజ్జగించే కార్యక్రమాన్ని చేపట్టింది.

Update: 2025-06-08 06:27 GMT

మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలను పార్టీ నాయకత్వం బుజ్జగించే కార్యక్రమాన్ని చేపట్టింది. మంత్రి వర్గ విస్తరణలో పదవులు రాని వారి ఇళ్లకు వెళ్లి స్వయంగా వారితో మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఇంటికి పీసీసీచీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్రవ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ లు చేరుకున్నారు. ఈ దఫా విస్తరణలో సుదర్శన్ రెడ్డికి చోటు దక్కలేదు.

సుదర్శన్ రెడ్డి ఇంటికి...
దీంతో ఆయనను బుజ్జగించేందుకు సుదర్శన్ రెడ్డి ఇంటికి చేరుకుని నేతలు బుజ్జగిస్తున్నారు. విస్తరణలో తనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని సుదర్శన్ రెడ్డి కోరుతున్నారు. పార్టీలో సీనియారిటీతో పాటు సిన్సియారిటీ, నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేకపోవడంతో తనకు అవకాశం కల్పించాలన్నసుదర్శన్ రెడ్డి పేరును పరిశీలనలోకి తీసుకోలేదు. రెడ్డి సామాజికవర్గానికే ఈ విస్తరణలో చోటు దక్కలేదు. దీంతో ఆయనకు నచ్చ చెప్పేందుకు అగ్రనేతలు సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కూడా వీరిద్దరూ భేటీ కానున్నారని తెలిసింది


Tags:    

Similar News